మహేష్ బాబుకు హ్యాండిచ్చిన కాజల్...?

Friday,September 16,2016 - 03:32 by Z_CLU

 

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే కాజల్ ను కూడా తీసుకోవాలని మహేష్ అనుకున్నాడట. దీనికి కారణం పక్కా లోకల్ అనే ఐటెంసాంగ్ తో కుర్రకారును కాజల్ ఓ ఊపుఊపడమే. ఆ సాంగ్ యమ పాపులర్ అవ్వడంతో… తన సినిమాలో కూడా కాజల్ ను ఐటెంభామగా తీసుకోవాలని అనుకున్నారట మహేష్-మురుగదాస్మ. అయితే ఈ విషయంలో చందమామ కాజల్ మాత్రం పక్కా క్లారిటీతో ఉంది. ఇకపై అలాంటి సాంగ్స్ చేయనని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది.

image0011

కేవలం ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం, యంగ్ టైగర్ పై ఉన్న అభిమానంతోనే జనతా గ్యారేజ్ లో ఐటెంసాంగ్ చేయడానికి ఒప్పుకున్నానని… మిగతా సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేసే ప్రసక్తే లేదని కాజల్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈమధ్య తమిళ్ నుంచి కూడా ఇలాంటి ఆఫర్లు కొన్ని రావడంతో కాజల్ ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా కూడా… ఐటెంసాంగ్స్ చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంది.

image0006