డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సందీప్ కిషన్ కొత్త సినిమా

Tuesday,January 15,2019 - 01:04 by Z_CLU

ఈ సారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్నాడు సందీప్ కిషన్. రీసెంట్ గా ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో ఈ సినిమా ఉండబోతుంది. ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి అతని గురువుకి మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

మహాభారతంలో ‘ఏకలవ్యుడు’ నుండి బొటనవేలు గురుదక్షిణగా తీసుకున్నాడు ద్రోణాచార్యుడు. మరి ఆధునిక యుగంలో అలాంటి అనుభవమే ఎదురైతే..? ఆ శిష్యుడు ఏం చేస్తాడు..? ఇంతకీ ఈ సినిమాలో గురువు అడగబోయే దక్షిణ ఏంటి..? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది.

శ్రీనివాస్ బొగ్గారం నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. త్వరలో ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన నటించనున్న హీరోయిన్ డీటేల్స్ తో పాటు తక్కిన నటీనటుల వివరాలు అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.