‘RRR’ సెకండ్ షెడ్యూల్ కి అంతా రెడీ

Tuesday,January 15,2019 - 02:04 by Z_CLU

రీసెంట్ గా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది RRR సినిమా. ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించారు మేకర్స్. ఆ తర్వాత కార్తికేయ పెళ్లి అని లాంగ్ బ్రేక్ తీకున్నాడు జక్కన్న. ఈ లోపు చెర్రీ ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక అన్ని పనులు ముగించుకుని ఫుల్ ఫోకస్ ‘RRR’ పెట్టిన టీమ్ ఈ నెల 21 నుండి సెకండ్ షెడ్యూల్ బిగిన్ చేయనుందని తెలుస్తుంది.

ఆల్మోస్ట్ ఈ షెడ్యూల్ కి సంబంధించి ప్రిపరేషన్స్ కంప్లీట్ చేసుకున్న మేకర్స్, ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. మ్యాగ్జిమం ఈ షెడ్యూల్ లో కూడా రామ్ చరణ్, NTR కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది.

D.V.V. దానయ్య నిర్మించనున్న ‘RRR’ కి కీరవాణి మ్యూజిక్ కంపోజర్. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.