ఎఫ్2 మూవీ 3 రోజుల కలెక్షన్

Tuesday,January 15,2019 - 12:24 by Z_CLU

ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఎఫ్2 సినిమా. వెంకటేష్, వరుణ్ కలిసి నటించిన సినిమా సంక్రాంతి బరిలో లేటుగా విడుదలైంది. దీంతో థియేటర్లు తక్కువగా దొరికాయి. అయితే సినిమా హిట్ అవ్వడం, మిగతా సినిమాల రిజల్ట్స్ తేలిపోవడంతో ఎఫ్2కు రేపట్నుంచి మరిన్ని థియేటర్లు కేటాయించబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు.

నిన్నటితో 3 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల రూపాయలకు పైగా షేర్ రాబట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరవ్వడానికి రెడీగా ఉంది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 5.10 కోట్లు
సీడెడ్ – రూ. 1.69 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.79 కోట్లు
ఈస్ట్ – రూ. 1.61 కోట్లు
వెస్ట్ – రూ. 1.05 కోట్లు
గుంటూరు – రూ. 1.27 కోట్లు
కృష్ణా – రూ. 1.25 కోట్లు
నెల్లూరు – రూ. 0.46 కోట్లు