హన్సిక ఇంటర్వ్యూ

Wednesday,November 13,2019 - 02:18 by Z_CLU

తెనాలి రామకృష్ణ B.A.B.L లో సందీప్ కిషన్ సరసన నటించింది హన్సిక. ఈ సినిమాలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన ఈ హీరోయిన్, సినిమాలో తన క్యారెక్టర్ గురించి, తన సినిమా కరియర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. అవి మీకోసం. 

మీకు తెలిసిందే…

సినిమాలో ఏం ఉండబోతుందన్నది మీకు తెలిసిందే. కోర్టు.. లాయర్స్ చుట్టూ తిరిగే కథ. ఓ రకంగా చెప్పాలంటే ఇది దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి సినిమా. చాలా ఫన్.. ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది.

నా క్యారెక్టర్…

తన తండ్రి గొప్ప లాయర్ కాబట్టి.. తను కూడా అలాగే గొప్ప లాయర్ అవ్వాలి అనుకుంటూ ఉంటుంది. తనకన్నీ తెలుసు అనుకునే ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఇకపోతే ఓ మేజర్ కేసులో తెనాలికి చాలా సపోర్టివ్ గా ఉంటుంది.

హ్యాపీ సినిమా…

సినిమాలో సస్పెన్స్ ఉండదు… చాలా ఫన్ ఉంటుంది. మర్డర్ మిస్టరీ లాంటి ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. ఎమోషన్ ఉంటుంది. నాగేశ్వర్ రెడ్డి మార్క్ కామెడీ ఉంటుంది… ఫ్యామిలీ తో చూడదగ్గ సినిమా.

నాకలాంటి ఫీలింగ్ ఉండదు…

సినిమాలో నా క్యారెక్టర్ తగ్గిపోయింది. హీరోతో కంపేర్ చేస్తే హీరోయిన్ క్యారెక్టర్ కి పెద్దగా పర్ఫామెన్స్ కి స్కోప్ లేదు అనే ఫీలింగ్స్ అస్సలు ఉండవు. క్యారెక్టర్ ఎలాంటిదైనా దానిని 100% జెన్యూన్ గా అడాప్ట్ చేసుకున్నానా  లేదా అనేదే ఆలోచిస్తా.. ఇక తెనాలి.. లో నా క్యారెక్టర్ కి కూడా మంచి స్కోప్ ఉంది. అది సినిమా చూస్తే తెలుస్తుంది.

అంతకు మించి ఏం లేదు…

తెలుగులో గ్యాప్ నాకు తెలీకుండానే వచ్చేసింది. తమిళంలో కొంచెం బిజీ అయ్యేసరికి కొన్ని తెలుగు సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ‘తెనాలి..’ విషయంలో కూడా అంతే… డేట్స్ కోసం కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ నాకోసం కొన్ని రోజులు వెయిట్ కూడా చేశారు. అందుకే ఈ సినిమా పాసిబుల్ అయింది…

లాయరవ్వానుకున్నా…

టాపిక్ ఏదైనా నేను చాలా ఆర్గ్యూ చేస్తా.. అందుకే ఒకవేళ యాక్టర్ ని అవ్వలేకపోతే లాయర్ అవ్వాలనుకున్నా… ఆ కల నాకు ఈ సినిమాతో తీరింది. కాకపోతే ఈ సినిమాలో నేను సక్సెస్ ఫుల్ లాయర్ ని కాను. రియల్ లైఫ్ లో సక్సెస్ ఫుల్ అవ్వాలనుకున్నా…

50 దాటినా ఇదే మొదలు…

ఇది నాకు 52 వ సినిమా. అయినా నాకు ఇదే బిగినింగ్ అన్న ఫీలింగ్ ఉంది. నన్నీ స్థాయిలో నిలబెట్టిన ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి అందరికీ చాలా థాంక్స్.

నెగెటివ్ రోల్స్ లో…

పర్ఫామెన్స్ కి స్కోప్ ఉండాలి… టైమింగ్ కుదరాలి కానీ.. నెగెటివ్ రోల్ అయినా చేస్తా… ఇప్పటికే నేను మోహన్ లాల్ గారి సినిమాలో ఆల్రెడీ నెగెటివ్ రోల్ లో నటించా.. తెలుగులో కూడా అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తా…

అమ్మ ఇచ్చిన గిఫ్ట్…

నాకు కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. రీసెంట్ గా ‘ధంతెరస్’ ఫెస్టివల్ రోజు అమ్మ నాకు కారు గిఫ్ట్ గా ఇచ్చింది.. చాలా హ్యాప్పీ.

ప్రస్తుతానికి నా ఫోకస్ అదే…

నేను చాలా హ్యాప్పీ పర్సన్ ని. నాకు ఎవరితో కంప్లైంట్స్ ఉండవు. ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం మంచి సినిమాలు చేయాలి.. మంచి మనస్తత్వంతో ఉండాలి.. మంచి పేరు తెచ్చుకోవాలి అంతే…

వెబ్ సిరీస్ లో చేస్తున్నా…

‘భాగమతి’ డైరెక్టర్ అశోక్ గారి డైరెక్షన్ లో వెబ్ సిరీస్ చేస్తున్నా. డిఫెరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది.  సస్పెన్ థ్రిల్లర్ అదీ. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. కథ మొత్తం నా క్యారెక్టర్ చుట్టే తిరిగుతుంది.

నేను చాలా లక్కీ…

సోషల్ మీడియాలో నా గురించి ఎవరూ ఎక్కడా చెడుగా మాట్లాడరు. చెడుగా రాయరు. ఈ విషయంలో నేను చాలా లక్కీ అనుకుంటా. అందుకే నాకు సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం.