వచ్చేవారం ‘సుబ్రహ్మణ్యపురం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Saturday,December 01,2018 - 11:02 by Z_CLU

ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ సినిమా పై మరింత ఇంట్రెస్ట్ ని రేజ్ చేసింది. అయితే ఆ క్యూరియాసిటీ ని మరింత రేజ్ చేసేలా పక్కా ప్లానింగ్ గా ప్రమోషన్స్ జరుపుకుంటున్నారు మేకర్స్, ఈ ప్రాసెస్ లో భాగంగా వచ్చేవారం గ్రాండ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది.  అన్నీ కుదిరితే డిసెంబర్ 4 న ఈ ఈవెంట్ జరిగే అవకాశాలున్నాయి.

ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ థ్రిల్లర్ లా తెరకెక్కింది సుబ్రహ్మణ్యపురం. సుమంత్ కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఈ జోనర్ లో సినిమా చేయడం. ఈ సినిమా సుతతో క్రియేట్ అవుతున్న డిమాండ్ ని మైండ్ లో పెట్టుకుని ఓవర్ సీస్ లో 100 కు పైగా థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకి డైరెక్టర్. ఈషా రెబ్బ హీరోయిన్. బీరం సుధాకర్ రెడ్డి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న  ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజర్. డిసెంబర్ 7 న రిలీజవుతుంది ఈ సినిమా.