‘సుబ్రహ్మణ్యపురం’ లో హైలెట్ కానున్న ఎలిమెంట్

Thursday,November 29,2018 - 12:03 by Z_CLU

డిసెంబర్ 7 న రిలీజవుతుంది సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. సుబ్రహ్మణ్య పురంలోని గుడి చుట్టూ తిరగే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ కానున్నట్టు తెలుస్తుంది.

ట్రైలర్ ని బట్టి హీరో దేవుడిని పెద్దగా నమ్మని వ్యక్తి అని క్లియర్ గా తెలుస్తుంది. ఇకపోతే సమస్యల్లా ఆ ఊరిలో రెగ్యులర్ గా జరిగే అన్ న్యాచురల్ మిస్టీరియస్ ఇన్సిడెంట్స్. వాటి మూలాలను బయటపెట్టాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చిన హీరో, ఏం తెలుసుకున్నాడు..? అనే పాయింట్ చుట్టూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో కథను రెడీ చేసుకున్న దర్శకుడు సంతోష్ జాగర్ల పూడి, సినిమాని కంప్లీట్ గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రెజెంట్ చేస్తున్నాడని తెలుస్తుంది.  

ఈ సినిమాలో సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజర్. బీరం సుధాకర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించాడు.