‘మిస్ గ్రానీ’ ప్రిపరేషన్స్ లో సమాంత

Saturday,December 01,2018 - 10:02 by Z_CLU

సమాంత కొత్త సినిమా షూటింగ్ బిగిన్ అయింది. నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది మిస్ గ్రానీ. అయితే ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో సమాంత లేని సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. సమాంత కూడా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఈ చాలెంజింగ్ రోల్ కోసం ప్రిపేర్ అవుతున్నా అని మెన్షన్ చేసింది.

ఒక ముసలావిడ సడెన్ గా యంగ్ అమ్మాయిలా మారడం, ఆ తరవాత జరిగే పరిణామాల నేపథ్యంలో తెరకెక్కనుందీ ఈ సినిమా. అయితే ఈ సినిమాలో ఆ ముసలావిడకి యంగ్ వర్షన్ లా కనిపించనుంది సమాంత.

కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. నందిని రెడ్డి ఈ తెలుగు నేటివిటీకి తగ్గట్టు గా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చైతు సరసన శివ నిర్వాణ డైరెక్షన్ లో నటిస్తున్న సమాంత త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.