గ్రాండ్ గా రిలీజైన సుబ్రహ్మణ్యపురం

Friday,December 07,2018 - 12:02 by Z_CLU

ఇంట్రెస్టింగ్ బజ్ మధ్య ఈ రోజే  గ్రాండ్ గా రిలీజైంది ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా. ‘దేవుడి మహిమా..? మానవ మేధస్సా..? ఏది గొప్పది’ అనే పాయింట్ తో ఇంట్రెస్టింగ్ డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సోషల్ మీడియాలో, పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ మ్యాగ్జిమం ఆడియెన్స్ కాన్సంట్రేషన్ గ్రాబ్ చేయడంలో సూపర్ సక్సెసయింది. దానికి తోడు ఫిల్మ్ మేకర్స్ చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. దానికి తగ్గట్టే ఇండియాలో వైడ్ రేంజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేసిన మేకర్స్, ఓవర్ సీన్ లో 100 కు పైగా థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించింది. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజర్. బీరం సుధాకర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి సంతోష్ జాగర్లపూడి డైరెక్టర్.