రజినీకాంత్ మురుగదాస్ సినిమాపై క్లారిటీ

Friday,December 07,2018 - 01:03 by Z_CLU

రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ కూడా బిగిన్ అయిపోయిందని, సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్, ఫ్యాన్స్ లో గట్టిగానే చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు మురుగదాస్.

రజినీకాంత్ కోసం ఫాంటసీ ఎలిమెంట్స్ తో మోస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో స్క్రిప్ట్ రెడీ చేసుకున్న మాట వాస్తవమేనని ఒప్పుకున్న మురుగదాస్, రజినీకాంత్ నుండి ఇంకా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ రాలేదన్న  విషయాన్ని రివీల్ చేశాడు. రజినీకాంత్ నుండి కన్ఫర్మేషన్ వచ్చాకే ఈ సినిమా విషయంలో మూమెంట్ ఉంటుందని చెప్పుకున్నాడు రజినీకాంత్.

రీసెంట్ గా రిలీజైన 2.0 తో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సూపర్ స్టార్, మరి మురుగదాస్ సినిమాలో నటిస్తాడా లేదా..? ఆయన మైండ్ లో ఏం నడుస్తుందనేది తెలియాలంటే ఇంకొన్ని రోజు వెయిట్ చేయాల్సిందే.