‘సుబ్రహ్మణ్యపురం’ జ్యూక్ బాక్స్ రివ్యూ

Tuesday,December 04,2018 - 12:53 by Z_CLU

సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ జ్యూక్ బాక్స్ రిలీజయింది. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో సందర్భానుసారంగా ఉండబోయే ఈ 3 సాంగ్స్, సోషల్ మీడియాలో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని రేజ్ చేస్తున్నాయి. ఈ సినిమా జ్యూక్ బాక్స్ రివ్యూ…

ఈ రోజిలా…:  సినిమాలో హీరో, హీరోయిన్ రిలేషన్ షిప్ ని ఎలివేట్ చేసే సాంగ్. ఖచ్చితంగా సిచ్యువేషన్ చెప్పడం కష్టమే కానీ, మోస్ట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో, ఆడియెన్స్ ని రిలాక్స్ చేసే ఎలిమెంట్ లా ఉండబోతుంది ఈ పాట. అనురాగ్ కులకర్ణి, నూతన కలిసి పాడారు. సురేష్ బానిసెట్టి లిరిక్స్ రాశాడు.

 

ఫ్రెండ్ షిప్ : ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా  విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చిన ఆడియెన్స్ కి  సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ లాంటిది ఈ సాంగ్. సినిమాలో ‘సుబ్రహ్మణ్యపురం’ కథకి, హీరో ఫ్రెండ్ కి ఏమైనా కనెక్షన్ ఉండబోతుందా..? అసలు ఈ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ లో ఫ్రెండ్ షిప్ కి కూడా స్కోప్ ఉండబోతుందనే హింట్, సినిమా స్టోరీలైన్ పై అంచనాలను పెంచుతుంది.  ధనుంజయ్ పాడిన ఈ పాటకి పూర్ణచారి లిరిక్స్ రాశాడు.

సాహో షణ్ముఖ : ‘సుబ్రహ్మణ్యపురం’ లో జరుగుతున్న అఘాయిత్యాలను ఆపమని భగవంతుణ్ణి వేడుకునే సాంగ్. సిచ్యువేషన్  ని ఎలివేట్  చేస్తున్న లిరిక్స్ విషయం కాస్త  పక్కన పెడితే, పాటలో పల్లవి తరవాత నుండి బిగిన్ అయ్యే ఎలక్ట్రానిక్ ట్యూన్, విజువల్స్ పై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేస్తుంది. ఈ పాటని S.P బాలసుబ్రహ్మణ్యం పాడారు. జొన్నవిత్తుల రామలింగేశ్వర రాజు లిరిక్స్ రాశాడు.

ఓవరాల్ గా ‘సుబ్రహ్మణ్య పురం’ సినిమాపై ఇప్పటికే క్రియేట్ అవుతున్న బజ్ కి అడిషనల్ మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాయి ఈ సాంగ్స్. ఈ సినిమా డిసెంబర్ 7 న గ్రాండ్ గా రిలీజవుతుంది.