సుబ్రహ్మణ్య పురం డైరెక్టర్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Thursday,December 06,2018 - 02:31 by Z_CLU

సుమంత్ కరియర్ లోనే ఫస్ట్ టైమ్ థ్రిల్లర్ జోనర్ లో నటించాడు. థ్రిల్లర్  జోనర్స్ ని చూడటానికి కూడా ఇష్టపడని సుమంత్ చేత, ఈ సినిమా ఎలాగైనా చేయాల్సిందే అనుకునేంతలా మెస్మరైజ్ చేసిన కథతో తెరకెక్కిందే సుబ్రహ్మణ్య పురం.

మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా, ఆడియెన్స్ కి స్పెల్ బౌండ్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈ సినిమా దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ‘జీ సినిమాలు’ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తన మనసులోని మరెన్నో మాటలు షేర్ చేసుకున్నాడు ఈ డెబ్యూ డైరెక్టర్. అవి మీకోసం.

 

అలా మొదలైంది…

ఈ సినిమా కన్నా ముందు 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. వాటికి యూ ట్యూబ్ లో మంచి బజ్ వచ్చింది. ఆ తరవాత ఒక చానల్ వాళ్ళు నా ఇంటర్వ్యూ చేయడంతో, ఇండస్ట్రీ పెద్దల దృష్టిలో పడ్డాను.  అదే ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా.

 

ఆ తరవాత నేను…

ఆయన చెప్పిన మూలకథకి కంప్లీట్ గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ 75 సీన్స్ తో కంప్లీట్ స్క్రిప్ట్ ని డెవెలప్ చేసుకున్నాను.

 

సుమంత్ గారితో…

నేనీ కథ రాసుకుంటున్నప్పుడే సుమంత్ గారిని ఊహించుకుంటూ రాసుకున్నాను. లక్కీగా అప్పుడే ‘మళ్ళీ రావా’ సినిమా సూపర్ హిట్టయింది. ఆ తరవాత ఆయన్ని కలిసినప్పుడు రెండున్నర గంటలు స్టోరీ న్యారేట్ చేశాను షాట్ బై షాట్. అంతే ఫస్ట్ సిట్టింగ్ లోనే ఆయన సంతోష్ మనమీ సినిమా చేస్తున్నాం అన్నారు.

 

చిత్రమైన సమస్య…

‘సుబ్రహ్మణ్యపురం’ లో ఉండే ఒక చిత్రమైన సమస్య, హీరోకి ఉండే బ్యాక్ స్టోరీ సినిమాలో కీ ఎలిమెంట్స్. ఈ రెండింటిని బ్యాలన్స్ చేస్తూ క్లైమాక్స్ వరకు క్యూరియాసిటీ రేజ్ చేసే సస్పెన్స్ ఎలిమెంట్  జస్ట్  అద్భుతం.

 

కొత్త సుమంత్…  

సినిమాలో ఒక ఇమోషనల్ ఎలిమెంట్ లో సుమంత్ పర్ఫామెన్స్ జస్ట్ అవుట్ స్టాండింగ్ అనిపిస్తుంది. నిజానికి సినిమా అంతా ఒక ఎత్తు. అలాంటి పర్ఫామెన్స్ ఎవరైనా చేసేయగలరు పెద్ద విషయం కాదు. కానీ ఒక ఇమోషనల్ సీక్వెన్స్ లో సుమంత్ గారి పర్ఫామెన్స్ చూశాక, ఈ సినిమాకి ఆయనే పర్ఫెక్ట్ అనిపించింది. కొత్త సుమంత్ ని చూస్తారు మీరంతా.

 

సినిమా పిచ్చి…

ప్రైవేట్ సెక్టార్ లో ప్రెజర్ ఉంటుందని చెప్పి, కష్టపడి మరీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాదించా. అది కూడా నాకు హ్యాప్పీనెస్ ఇవ్వలేకపోయింది. బ్యాంక్ సెక్టార్ లో పీక్స్ చూశా. కానీ అల్టిమేట్ గా నేను చేయాల్సిందిదే.

 

నేను అందరిలా కాదు…

అందరూ కరియర్ బిగినింగ్ లో లవ్ జోనర్ ప్రిఫర్ చేస్తారు. కానీ నేనలా చేయలేదు. షార్ట్ ఫిలిమ్స్ లో కూడా థ్రిల్లర్ జోనర్స్ నే ఎంచుకున్నా. ఈ సినిమా కూడా అంతే. నా నెక్స్ట్ సినిమాలు కూడా థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్సే.

సుమంత్ గారికి ఇష్టం లేదు…

నిజానికి సుమంత్ గారికి థ్రిల్లర్స్ జోనర్స్ నచ్చవు. అందుకే నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా థ్రిల్లర్ అనగానే, డిజప్పాయింట్ అయిపోయారు. అక్కడి దాకా వెళ్లాను కదా అన్న మొహమాటానికి ఆయన స్టోరీ వినడం మొదలుపెట్టినా, ఫస్ట్ 10 మినిట్స్ లో స్టోరీకి కనెక్ట్ అయిపోయారు.

సుమంత్ గారి పట్టుదల…

మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో చాలా ఆప్షన్స్ అనుకున్నాం కానీ, సుమంత్ గారు మాత్రం శేఖర్ చంద్ర అయితేనే పర్ఫెక్ట్ అని బిగినింగ్ నుండే పట్టుదలగా ఉన్నారు. అంతకు మించి ప్రాజెక్ట్ కి ప్లస్ అయ్యాడు శేఖర్ చంద్ర.

 

ఈషారెబ్బ రోల్…  

సినిమాలో సుమంత్ గారి రోల్ కి కంప్లీట్ గా ఆపోజిట్ క్యారెక్టర్ ఈషారెబ్బ ప్లే చేశారు. ఒకరకంగా చెప్పాలంటే పరమ భక్తురాలు. దేవుణ్ణి అమితంగా నమ్మే వ్యక్తి. అలాగే సోషల్ అవేర్ నెస్ ఉన్న అమ్మాయి. దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే ప్రాసెస్ లో కూడా ఒకరు బాధపడుతుంటే చూస్తూ ఉండలేదు.

 

100% సిచ్యువేషనల్ కామెడీ

సినిమాలో కామెడీకి స్పెషల్ ట్రాక్స్ ఏమీ ఉండవు. కానీ 100% సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. చాలా న్యాచురల్ గా ఉంటుంది.

 

మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్…

సినిమాలో విలన్ ఎవరన్నది ఎవరూ కనుక్కోలేరు. క్లైమాక్స్ లో అది షాకింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్. ఆడియెన్స్ స్పెల్ బౌండ్ అయ్యే మూమెంట్ అది.

 

ప్రొడక్షన్ వ్యాల్యూస్…

ప్రొడ్యూసర్ బీరం సుధాకర్ రెడ్డి  అద్భుతమైన సపోర్ట్ అందించారు. బిగినింగ్ లో మేమనుకున్న బడ్జెట్ కన్నా, సినిమాలో VFX కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఏ మాత్రం వెనకాడకుండా సపోర్ట్ అందించారాయన.

 

చివరిగా సినిమా గురించి…

‘సుబ్రహ్మణ్యంపురం’ సినిమా అందరికీ నచ్చే సినిమా. చిన్న పిల్లల దగ్గరినుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో రాసుకున్నా ఈ కథని. కంపల్సరీగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది.