వీళ్ళ రూట్ కొంచెం వేరు...

Wednesday,November 13,2019 - 10:02 by Z_CLU

ఒక్కో హీరో ఎంట్రీ ఒక్కోలా ఉంటుంది. మొదటి సినిమా ప్రతి స్టార్ హీరోకి స్పెషలే… సెలెబ్రిటీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోల సినిమా అయితే రిలీజ్ అవ్వకముందే ఫోకస్ లోకి వచ్చేస్తుంది. అయితే వీళ్ళలో చాలా మంది సొంత బ్యానర్ లో కాకుండా, వేరే బ్యానర్ లో లాంచ్ అవ్వడానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడున్న చాలా యంగ్ స్టార్ హీరోస్ అలా లాంచ్ అయిన వల్లే. అయితే వీళ్ళు మాత్రం కొంచెం వేరు…

 

గల్లా అశోక్ : ప్రస్తుతానికి మహేష్ బాబు మేనల్లుడు గానే ఈ హీరోకి గుర్తింపు ఉంది. కానీ మొదటి సినిమాతోనే లెక్క మారుస్తా అన్నంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గల్లా ఆశిక్ కి సక్సెస్ ఫుల్ డెబ్యూ అవుతుందంటున్నారు.

శివ కందుకూరి : సక్సెస్ ఫుల్ నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు. చూసీ చూడంగానే సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. హార్ట్ టచింగ్ యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా శివ కందుకూరిని ఏ స్థాయిలో నిలబెడుతుందో చూడాలి.

బెల్లంకొండ శ్రీనివాస్ : కరియర్ బిగినింగ్ లోనే మాస్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ లాంచ్ అయింది కూడా సొంత బ్యానర్ లోనే. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుని స్టార్ హీరో అనిపించుకున్నాడు.