7 Years of Zee Cinemalu.. అందరికీ ధన్యవాదాలు !

Monday,September 04,2023 - 01:03 by Z_CLU

– ప్రేక్షకుల ఆదరాభిమానాలతో 7 సంవత్సరాలు పూర్తిచేసుకున్న జీ సినిమాలు..
– ఇన్ని సంవత్సరాలుగా మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లందరికి కృతజ్ఞతలు..

ప్రతీ రోజు వరుస సినిమాలతో అదిరిపోయే ఎంటర్టైన్ మెంట్ అందిస్తూ వస్తున్న జీ సినిమాలు నేడు 7th Anniversary జరుపుకుంటోంది. ఏడేళ్ళ  నుండి ప్రతి రోజు ఆరు విభిన్న సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ వారిని ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్న జీ సినిమాలు.. ప్రేక్షకుల ఆదరణతో మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది.

తక్కువ టైంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఛానెల్ గా పేరు తెచ్చుకుంది మన Zee Cinemalu.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా గ్రాండ్ గా ప్రారంభమైన జీ సినిమాలు ఛానెల్.. మెగా ఆశీస్సులతో బుడి బుడి అడుగులతో ప్రారంభమై, నేడు విజయవంతంగా ఏడేళ్ళు  పూర్తిచేసుకొని తెలుగు ప్రేక్షకులకు అన్-లిమిటెడ్ వినోదాన్ని అందిస్తూ వస్తోంది.

ప్రేక్షకులు ఇచ్చిన ఉత్సాహంతో.. రాబోయే రోజుల్లో, మరిన్ని సూపర్ హిట్ సినిమాలు, ఎక్స్ క్లూజివ్ ఈవెంట్స్ తో మరింత ఎంటర్ టైన్ మెంట్ ను అందించడానికి సిద్ధంగా ఉంది మీ జీ సినిమాలు.

ఏడేళ్ళ  ప్రయాణంలో జీ సినిమాలు సాధించిన విజయాలు ఎన్నో. దిల్ పై సూపర్ హిట్ అంటూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న జీ సినిమాలు.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్, శాటర్ డే మెగా మూవీ, ఫ్రైడే బ్లాక్ బస్టర్స్, 9 డేస్ 9 బ్లాక్ బస్టర్స్ లాంటి ఎన్నో విలక్షణమైన సెగ్మెంట్స్ తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.

టీవీ ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందిస్తూనే, డిజిటల్ వేదికగా కూడా తన సత్తా చాటుతోంది జీ సినిమాలు. ఛానల్ లాంఛ్ తో పాటు ఒకేసారి వెబ్ సైట్ ను కూడా ప్రారంభించి, www.zeecinemalu.com సైట్ ద్వారా ఎప్పటికప్పుడు టాలీవుడ్ కు చెందిన లేటెస్ట్ అప్ డేట్స్, ఫొటోస్, బాక్సాఫీస్ కలెక్షన్స్, మూవీ రివ్యూస్ ను అందిస్తోంది. ఈ సందర్భంగా మా సైట్ వీక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.

రాబోయే రోజుల్లో ఇటు బుల్లితెర వీక్షకులకు, అటు డిజిటల్ ఆడియన్స్ కు మరింత వినోదాన్ని అందించే లక్ష్యంతో, సరికొత్త స్టఫ్ తో నిత్యనూతనంగా మిమ్మల్ని అలరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంది మీ Zee Cinemalu.