ఫైనల్ షెడ్యూల్ లో 'శ్రీనివాస కళ్యాణం'

Friday,June 01,2018 - 05:02 by Z_CLU

నితిన్ హీరోగా దిల్ రాజు, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’ కు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈరోజు నుండి అమలాపురం సమీపంలో షూటింగ్ జరగనుంది. దాదాపు 20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో నితిన్, రాశి ఖన్నా, నందిత శ్వేతాలతో పాటు మిగతా నటీ నటులపై కొన్ని కీలక సీన్స్ అలాగే బ్యాలెన్స్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు.

ఇప్పటికే దాదాపు 70 % షూటింగ్ ఫినిష్ చేసిన యూనిట్ ఈ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్నారు. మరో వైపు ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది. శ్రవణ మాసం సందర్భంగా ఆగస్ట్ 9 న సినిమాను గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.