చిరు ఫిక్సయ్యాడు.... ఒకేసారి రెండు సినిమాలు...?

Friday,June 01,2018 - 06:02 by Z_CLU

ప్రస్తుతం ‘సైరా నరసింహ రెడ్డి’ సినిమాతో బిజీ గా ఉన్నాడు మెగా స్టార్ చిరంజీవి. ఈ సినిమా తర్వాత చిరు ఎవరితో చేస్తాడా.. అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఇప్పటికే మెగా స్టార్ కొరటాల కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని, చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 22 ఈ సినిమాను అనౌన్స్ చేసే చాన్స్ ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం ‘సైరా’ సినిమాకు సంబంధించి ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు మెగా స్టార్. ఈ సినిమాకు సంబంధించి కాస్త ఆలస్యమైనా మంచి అవుట్ పుట్ వచ్చేలా చూసుకుంటున్నాడు. మరోవైపు ఈ సినిమాతో  పాటే చిరు కొరటాల సినిమాను కూడా  సైమల్టియస్ గా  ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పటికే మెగా స్టార్ కోసం కొరటాల శివ ఒక పొలిటికల్ టచ్ తో యాక్షన్ ఎంటర్టైనర్ కథను సిద్దం చేసినట్లు తెలుస్తుంది.