‘జంబలకిడిపంబ’ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్

Friday,June 01,2018 - 02:34 by Z_CLU

ఈ నెల 14 న రిలీజవుతుంది హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘జంబలకిడి పంబ’. శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా రెగ్యులర్ కామెడీ సినిమాలకు భిన్నంగా ఉంటుందనే టాక్, ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

ప్రేమించి పెళ్ళి చేసుకున్న లవ్ కపుల్, చిన్న చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల విడాకులు తీసుకోవాలి అనుకునే టైమ్ లో, ఇద్దరి లక్షణాలు చేంజ్ అయిపోవడం సినిమాలో కీ పాయింట్ అని తెలుస్తుంది. భార్య లక్షణాలు భర్తకి, భర్త లక్షణాలు భార్యకి ట్రాన్స్ ఫర్ అవ్వడంతో పడే ఇబ్బందులు సినిమాలో మెయిన్ హిలేరియస్ ఎలిమెంట్ కానుంది.

దానికి తోడు శ్రీనివాస్ ఆడ లక్షణాలతో చేసే పర్ఫామెన్స్ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. అసలు కథ భార్యా భర్తల మధ్య గొడవలు, విడాకులు లాంటి పాయింట్ చుట్టూ తిరిగినా, ఆడ మగగా, మగ ఆడగా పడే అవస్థలు సినిమాలో కావలసినంత కామెడీని జెనెరేట్ చేయనున్నాయి.

శ్రీనివాస్ రెడ్డి సరసన సిద్ధి ఇద్నాని జంటగా నటించిన ఈ సినిమాకి J.B. మురళీ కృష్ణ డైరెక్టర్. రవి, జోజో జోస్,  శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.