ఈసారి పోలీస్ గెటప్ లో శ్రీవిష్ణు

Wednesday,October 09,2019 - 12:27 by Z_CLU

డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ చేస్తున్న శ్రీవిష్ణు ఈసారి కాప్ గా మారబోతున్నాడు. ఈ ఏడాది `బ్రోచేవారెవ‌రురా`తో సూప‌ర్‌హిట్ సాధించిన ఈ హీరో.. తన అప్ కమింగ్ మూవీని విజ‌య‌ద‌శ‌మి రోజున ప్ర‌క‌టించాడు. ఈ చిత్రానికి ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు పోలీస్ గా కనిపించబోతున్నాడు. న‌వంబ‌ర్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు.

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌దీప్ వ‌ర్మ‌
నిర్మాత‌: ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు)
బ్యాన‌ర్‌: ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫీ: శేఖ‌ర్ వి.జోసెఫ్‌
ఆర్ట్‌: వివేక్‌