సైరా ఫస్ట్ వీక్ కలెక్షన్

Wednesday,October 09,2019 - 01:26 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. నిన్నటితో 7 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి 83 కోట్ల 23 లక్షల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. గాంధీ జయంతి రోజున విడుదలవ్వడం, దసరా హాలిడేస్ కూడా కలిసిరావడంతో సైరా సినిమాకు ఏపీ, నైజాంలో భారీ ఎత్తున వసూళ్లు వస్తున్నాయి.

తాజా వసూళ్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు మరింత దగ్గరైంది. ఈ వీకెండ్ ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇది బ్రేక్-ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెవెన్యూ పర్సెంటేజీ ప్రకారం చూసుకుంటే.. ఏపీ,నైజాంలోని అన్ని ఏరియాల్లో ఈ సినిమా 75 శాతం రికవరీ అయింది.

అయితే సైరా వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బాగున్నాయి. మిగతా చోట్ల ఆశించిన స్థాయిలో వసూళ్లు కనిపించడం లేదు. కర్నాటకలో ఈ సినిమాకు ఇప్పటివరకు 50శాతం మాత్రమే రెవెన్యూ వచ్చింది. అక్కడ బ్రేక్-ఈవెన్ అవ్వడం కష్టం అంటున్నారు. నార్త్ లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఓవర్సీస్ లో ఈ వీకెండ్ గడిస్తే కానీ చెప్పలేం.

ఏపీ, నైజాం 7 రోజుల షేర్
నైజాం – రూ. 23.95 కోట్లు
సీడెడ్ – రూ. 15 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 12.30 కోట్లు
ఈస్ట్ – రూ. 7.45 కోట్లు
వెస్ట్ – రూ. 5.75 కోట్లు
గుంటూరు – రూ. 8.45 కోట్లు
నెల్లూరు – రూ. 3.90 కోట్లు
కృష్ణా – రూ. 6.43 కోట్లు