Samajavaragamana రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న శ్రీ విష్ణు

Tuesday,June 13,2023 - 11:59 by Z_CLU

Sree Vishnu’s ‘Samajavaragamana’ Releasing Worldwide On June 29th

హీరో శ్రీవిష్ణు ‘సామజవరగమన’ తో హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి సిద్దమవుతున్నాడు. ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్, ఇతర ప్రమోషనల్ స్టప్ పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది.

మేకర్స్ ఆకట్టుకునే పోస్టర్ తో  సినిమా విడుదల తేదీను ప్రకటించారు. జూన్ 29 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సామజవరగమన నవ్వులు పూయించనుందని తెలియజేశారు. శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, వెన్నెల కిషోర్, నెల్లూరు సుదర్శన్ కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ అలరించింది.

గోపీ సుందర్ సంగీతం అందించిన ఫస్ట్  సింగిల్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్క్రీన్‌ప్లే రాశారు.