నితిన్, కీర్తి సురేష్ 'రంగ్ దే' ప్రారంభం

Wednesday,October 09,2019 - 12:19 by Z_CLU

‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ఫస్ట్ కాంబినేషన్ లో ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. విజయదశమి రోజున ఈ సినిమా ప్రారంభమైంది. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాల్ని తీసిన యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

హీరోహీరోయిన్లు నితిన్, కీర్తిసురేష్ పై దర్శకులు త్రివిక్రమ్ క్లాప్ కొట్టారు. చిత్రం స్క్రిప్ట్ ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) లు దర్శకుడు వెంకీ అట్లూరి కి అందచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, జెమిని కిరణ్, సుధాకర్ రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. విజయదశమి రోజున ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా కంటిన్యూ గా జరుగుతుంది, 2020 వేసవి కానుకగా చిత్రం విడుదల అవుతుంది.