Solo Brathuke So Better - డీసెంట్ హిట్

Friday,December 25,2020 - 09:47 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గ్రాండ్ గా రిలీజైంది సోలో బ్రతుకే సో బెటర్ మూవీ. సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా యూఎస్ తో పాటు దుబాయ్ లాంటి కొన్ని అరబ్ దేశాల్లో ఇప్పటికే తొలి షో పడింది. అక్కడి ఆడియన్స్ ఈ సినిమాకు హిట్ టాక్ ఇచ్చారు.

అమెరికా, దుబాయ్, షార్జా, అబుదాబి, దోహా, ఖతార్ లాంటి ప్రాంతాల్లో సినిమా చూసిన వాళ్లంతా తమ ఒపీనియన్ ను సోషల్ మీడియాలో చెబుతున్నారు. అంతా కామన్ గా చెబుతున్న పాయింట్ ఏంటంటే.. సినిమా డీసెంట్ హిట్ అని.

మూవీలో కామెడీ సీన్స్ అదిరిపోయాయంట. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో వచ్చే సాయిధరమ్ తేజ్, సత్య కామెడీ హైలెట్ అంటున్నారు. దీనికితోడు తమన్ పాటలన్నీ తెరపై ఇంకా ఎట్రాక్ట్ చేశాయని చెబుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో షోలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మరికాసేపట్లో ఇక్కడ్నుంచి కూడా ఫస్ట్ టాక్ రాబోతోంది.

ఈ మూవీపై జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ మరికాసేపట్లో..

Also Check – సోలో బ్రతుకే సో బెటర్ ఎట్రాక్షన్స్