Vijay Deverakonda - మరో రికార్డ్

Thursday,December 24,2020 - 03:50 by Z_CLU

సౌత్ ఇండియన్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో మైల్ స్టోన్ అందుకున్నాడు. ఇనస్టాగ్రామ్ లో ఏకంగా కోటి మంది ఫాలోవర్స్ ను దక్కింకుకొని రికార్డు సృష్టించాడు. సౌత్ ఇండియన్ స్టార్స్ లో ఇనస్టాలో కోటి మంది ఫాలోవర్స్ ఉన్న నటుడు విజయ్ ఒక్కడే.

ఈ రేర్ రికార్డును ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ‘‘1 క్రోర్ ఇన్ స్టా రౌడీస్’’ అనే ట్యాగ్ తో వరల్డ్ వైడ్ గా సోషల్ మీడియా అంతా ట్రెండింగ్ చేస్తున్నారు.

Vijay Deverakonda Instagram 1 Cr Followers 2

విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన డిఫరెంట్ అటిట్యూడ్, స్టైల్ తో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైల్లో క్రియేటివ్ గా పోస్ట్ లు పెడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

అందుకే ఇంతమంది విజయ్ కు ఫిదా అయ్యారు. ఓ ఫోటో పెట్టినా, వీడియో అప్ లోడ్ చేసినా లైకులు, కామెంట్లతో అభిమానులు ప్రేమ కురిపిస్తారు.