Solo Brathuke So Better - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,December 28,2020 - 02:02 by Z_CLU

సుప్రీమ్ హీరో సాయితేజ్, బ్యూటిఫుల్ నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ (3 రోజులు) పూర్తిచేసుకున్న ఈ సినిమా వసూళ్లలో కూడా ది బెస్ట్ అనిపించుకుంటోంది.

మూడో రోజైన ఆదివారం ఈ సినిమాకు 2 కోట్ల 80 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి 3 రోజుల్లో 10 కోట్ల 79 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టయింది. తాజా వసూళ్లలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో బ్రేక్-ఈవెన్ టచ్ అయింది.

రేపట్నుంచి ఈ సినిమా థియేటర్లకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. 50 శాతం ఆక్యుపెన్సీతో అతి తక్కువ రోజుల్లోనే ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరవ్వడం నిజంగా గ్రేట్ అంటోంది ట్రేడ్.

ఏపీ, నైజాం 3వ రోజు గ్రాస్ (With 50% Occupancy)

నైజాం – 98 లక్షలు
సీడెడ్ – 54 లక్షలు
ఉత్తరాంధ్ర – 36 లక్షలు
గుంటూరు – 28 లక్షలు
కృష్ణా : 16 లక్షలు
ఈస్ట్ – 21 లక్షలు
వెస్ట్ – 13 లక్షలు
నెల్లూరు – 13 లక్షలు

3rd Day Total GROSS: 2.8 Cr
Total 3 days GROSS: 10.79 Cr