SBSB - అసలు ఎందుకు చూడాలి?
Wednesday,December 23,2020 - 11:35 by Z_CLU
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్.. క్రిస్మస్ కానుకగా 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. సుబ్బు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తప్పకుండా చూడ్డానికి 6 మెయిన్ రీజన్స్ ఉన్నాయి.

రీజన్-1: డిఫరెంట్ స్టోరీలైన్
బ్యాచిలర్ కష్టాల మీద చాలా సినిమాలొచ్చాయి. కానీ ఓ కుర్రాడు.. తన బ్యాచిలర్ లైఫ్ పై పీహెచ్డీ చేస్తే ఎలా ఉంటుంది. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఏకంగా ఓ ఉద్యమం మొదలుపెడితే ఎలా ఉంటుంది.. ఈ డిఫరెంట్ స్టోరీలైనే అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

రీజన్-2: సాయిధరమ్ తేజ్
స్టోరీలైన్ తర్వాత ఈ సినిమాకు మేజర్ హైలెట్ సాయిధరమ్ తేజ్. ఈ క్యారెక్టర్ కు రియల్ లైఫ్ లో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావాలి. ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్న హీరో సాయిధరమ్ తేజ్. తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో సాయితేజ్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు.

రీజన్-3: అదిరిపోయే ట్యూన్స్
మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ చూపించాడు. సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఆ సాంగ్స్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

రీజన్-4: నభా నటేష్
ఈ సినిమా కచ్చితంగా చూడాలనిపించే మరో రీజన్ నభా నటేష్. మోస్ట్ బ్యూటిఫుల్ నభా, తన గ్లామర్ తో కట్టిపడేస్తోంది. సినిమాకు సంబంధించి రిలీజైన స్టిల్స్ లో నభా చాలా అందంగా కనిపిస్తోంది. దీనికితోడు గర్ల్ నెక్ట్స్ డోర్ పాత్రలో తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుందని చెబుతోంది నభా.

రీజన్-5: కామెడీ ఎలిమెంట్స్
సినిమాలో మరో మేజర్ పార్ట్ కామెడీ. ఈ సినిమాలో కామెడీ చాలా కొత్తగా ఉంటుందని యూనిట్ చెబుతోంది. తాజాగా రిలీజైన ట్రయిలర్ లో కూడా ఆ కామెడీ యాంగిల్ కొంచెం కనిపించింది. సినిమాలో కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉందనేది గ్యారెంటీ.

రీజన్-6: ప్రొడక్షన్ వాల్యూస్
మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్. బడ్జెట్ కు వెనకాడకుండా సినిమాను నిర్మించే ఈ బడా ప్రొడ్యూసర్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను రిచ్ గా తెరకెక్కించాడు.