Check - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,March 01,2021 - 05:32 by Z_CLU

భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది చెక్. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. ఈ 3 రోజుల్లో చెక్ సినిమాకు ఏపీ, నైజాంలో 6 కోట్ల 42 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

మిక్స్ డ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో వారం రోజులు నడవాలి. చంద్రశేఖర్ యేలేటి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్, ప్రియా ప్రకాష్ హీరోయిన్లుగా నటించారు.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్లు
నైజాం – రూ. 2.40 కోట్లు
సీడెడ్ – రూ. 0.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.90 కోట్లు
గుంటూరు – రూ. 0.82 కోట్లు
ఈస్ట్ – రూ. 0.32 కోట్లు
వెస్ట్ – రూ. 0.50 కోట్లు
కృష్ణా – రూ. 0.43 కోట్లు
నెల్లూరు – రూ. 0.25 కోట్లు