మహేష్ కోసం మళ్లీ సింగర్ గా మారిన హీరోయిన్

Saturday,August 08,2020 - 12:40 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే గిఫ్ట్ రెడీ అయింది. రేపు ‘సర్కారు వారి పాట’ నుండి టైటిల్ సాంగ్ ను మహేష్ పుట్టిన రోజు బహుమతిగా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.  తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను హీరోయిన్ శృతి హాసన్ తో పాడించారని తెలుస్తుంది.

మహేష్ ‘ఆగడు’ సినిమాలో “జంక్షన్ లో…” అనే సాంగ్ ను శృతి హాసన్ తో పాడించాడు తమన్. ఆ సాంగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ కోసం శృతిని రంగంలోకి దింపాడట తమన్.

రేపు ఏ టైం కి సాంగ్ రిలీజ్ చేసేది ఈరోజు సాయంత్రం కల్లా అనౌన్స్ మెంట్ ద్వారా తెలియజేయనున్నారు మేకర్స్. మరి మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే ఈ సాంగ్ ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పరశురాం దర్శకుడు.