Sarkaru Vaari Paata - అప్డేట్ రానుందా?

Saturday,May 08,2021 - 04:10 by Z_CLU

స్టార్ హీరోలు కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. సూపర్ స్టార్ మహేష్ కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అవును మే నెలలో తండ్రి పుట్టిన రోజు తన సినిమా నుండి ఫస్ట్ లేదా టీజర్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తాడు మహేష్. మొదట్లో అభిమానులను సంతోష పెట్టడానికి ఆ డేట్ ని ఎంచుకున్నా రాను రాను అది మహేష్ కి ఓ సూపర్ సెంటిమెంట్ అయిపొయింది. ఆ రోజు రిలీజ్ అయ్యే ఫస్ట్ లేదా టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది అనేది మహేష్ గట్టిగా నమ్ముతున్నాడు. అందుకే ఈ ఏడాది కూడా తన అప్ కమింగ్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

ఇక మేకర్స్ కూడా అదే పనిలో ఉన్నారు. మహేష్ లుక్ తో ఫస్ట్ లుక్ రెడీ చేస్తున్నారు. దీనితో పాటే ఓ టీజర్ కూడా వదిలే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. సినిమాలో సన్నివేశాలతో టీజర్ రాకపోయినా ఫస్ట్ లుక్ తో ఓ మోషన్ పోస్టర్ టీజర్ మాత్రం పక్కా అని టాక్ వినబడుతుంది. ఇక అదే రోజు మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి టైటిల్ ను రివీల్ చేయబోతున్నారు. అంటే కృష్ణ పుట్టిన రోజు నాడు మహేష్ నుండి రెండు సినిమాల న్యూస్ లు రానున్నాయన్నమాట. మరి మహేష్ నుండి రానున్న ఈ డబుల్ అప్డేట్స్ ఫ్యాన్స్ లో ఎలాంటి సంతోషాన్ని తీసుకోస్తాయో చూడాలి.

ఈ నెల 31న విడుదలయ్యే సర్కారు వారి ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి త్వరలోనే ఓ అప్డేట్ వదిలి టైం చెప్పనున్నారు. పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics