Samantha Movies: ఏదైనా దసరా తర్వాతే

Saturday,August 08,2020 - 01:18 by Z_CLU

లాక్ డౌన్ ఉన్నప్పటికీ హీరోహీరోయిన్లు తమ పనులు ఆపలేదు. సెట్స్ పైకి మాత్రమే వెళ్లలేదు. మిగతా స్టోరీ డిస్కషన్లు, కొత్త ప్రాజెక్టులు ఎనౌన్స్ చేయడం అన్నీ జరిగిపోతున్నాయి. అయితే వీళ్లందరికీ భిన్నంగా వ్యవహరిస్తోంది సమంత.

నిజంగానే సినిమాలకు దూరమైంది ఈ అక్కినేని కోడలు. లాక్ డౌన్ కు ముందు 2 సినిమాలకు ఓకే చెప్పినప్పటికీ వాటి గురించి మాట్లాడ్డం లేదు. పూర్తిగా healthy lifestyle మెయింటైన్ చేయడం పైనే దృష్టిపెట్టింది.

ఎంచక్కా టెర్రస్ పై గార్డెన్ పెట్టుకుంది. తను తినే కూరగాయల్ని తనే పండించుకుంటోంది. మరోవైపు భర్తతో కలిసి క్వాలిటీ టైమ్ గడుపుతోంది.

ఇలా లాక్ డౌన్ టైమ్ ను 100% సద్వినియోగం చేసుకుంటోంది Samantha. ఇక సినిమాల విషయానికొస్తే.. దసరా తర్వాతే ఆమె తన కొత్త సినిమాల గురించి ఆలోచిస్తుంది.

Samantha Latest మూవీ జాను