#RanaMiheeka: మరికొన్ని గంటల్లో పెళ్లి

Saturday,August 08,2020 - 12:11 by Z_CLU

హీరో రానా తన బ్యాచిలర్ లైఫ్ కు ఇవాళ్టితో గుడ్ బై చెప్పేస్తున్నాడు. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ మిహీకా మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఈరోజు రామానాయుడు స్టుడియోస్ లో ఈ పెళ్లి గ్రాండ్ గా జరగబోతోంది.

రానా పెళ్లి కోసం రామానాయుడు స్టుడియోస్ ను గ్రాండ్ గా తయారుచేశారు. సినిమా సెట్ ను తలపించేలా డిజైన్లు, డెకరేషన్లు చేయించారు.

పెళ్లికి సంబంధించి 3 రోజుల నుంచి వేడుకలు జరుగుతున్నాయి. హల్దీ సెలబ్రేషన్స్, మెహందీ ఫెస్టివల్, సంగీత్.. ఇలా ఎన్నో సంబరాల తర్వాత ఈరోజు రానా వివాహం తుది ఘట్టానికి చేరుకుంది.

రానాను పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు. అతడితో కలిసి వెంకీ, సురేష్ బాబు కలిసి దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.