షూటింగ్ అప్ డేట్స్

Sunday,December 08,2019 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ నెల 20 వరకూ చివరి షెడ్యుల్ జరగనుంది. దిల్ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 11న సినిమా థియేటర్స్ లోకి రానుంది.

అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ షూటింగ్ అన్నపూర్ణ ఏడెకరాల్లో జరుగుతుంది. సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. అల్లు అరవింద్ , రాదా కృష్ణ కంబైన్ గా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12న విడుదలవుతోంది.

రవితేజ -గోపీచంద్ మలినేని ‘క్రాక్’ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ప్రస్తుతం రవితేజ మిగతా నటులపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, పూజిత పొన్నాడ‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నాడు.

చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన్ లో నితిన్ నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. సారథి స్టూడియోస్ లో వేసిన సెట్ లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్  హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 

సాయి ధరం తేజ హీరోగా తెరకెక్కుతున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ గండిపేట్ లో జరుగుతుంది. ప్రస్తుతం హీరోపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుబ్బు దర్శకుడు. వచ్చే ఏడాది మే1 న సినిమా రిలీజ్చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

సాయి రామ్ శంకర్ హీరోగా తెరకెక్కుతున్న ‘రీ సౌండ్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది. ప్రస్తుతం సినిమా కోసం వేసిన పోలీస్ స్టేషన్ లో సెట్ సాయి రాం శంకర్ , పోసాని తదితరులపై సీన్స్ తీస్తున్నారు. వైజాగ్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. ఎస్ ఎస్ మురళి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి నిర్మిస్తున్నారు.