మూడు సినిమాలతో విజయ్ దేవరకొండ !

Sunday,December 08,2019 - 11:12 by Z_CLU

కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న విజయ్ దేవరకొండ వచ్చే ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇప్పటికే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కి సంబంధించి షూటింగ్ ఫినిషింగ్ స్టేజికొచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

జనవరి నుండి ‘ఫైటర్’ సినిమ సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లోనే థియేటర్స్ లోకి వచ్చే చాన్స్ ఉంది. ఈ సినిమాతో పాటే దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా కమిట్ అయ్యాడు విజయ్. శ్రీ హర్ష డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కూడా ఫైటర్ తో పాటే ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అంటే ఈ లెక్కన విజయ్ నుండి వచ్చే ఏడాది మూడు సినిమాలు రావడం గ్యారెంటీ.