షూటింగ్ అప్ డేట్స్

Sunday,August 25,2019 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో విజయ్ శాంతి పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. తర్వాత మలక్ పేట్ లో ఓ ప్రైవేట్ కాలేజిలో రెండు రోజులు షూట్ ప్లాన్ చేస్తున్నారు. ఓ బ్రేక్ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో మహేష్ బాబు పై సీన్స్ తీయనున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర నిర్మాత. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ శాంతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు.


సాయి ధరం తేజ్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ప్రతి రోజు పండగే’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రామానాయుడు(నానక్ రామ్ గూడ) స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్ లో సాయి ధరమ్ , సత్య రాజ్ కొందరు నటీ నటులపై కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. దాదాపు ఇరవై రోజుల పాటు షూట్ జరగనుంది. ఆ తర్వాత రాజమండ్రి వెళ్లి అక్కడ కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంత మంచి వాడవురా’ సినిమా మొదటి షెడ్యుల్ పూర్తయింది. రామానాయుడు స్టూడియోస్ లో వేసిన సెట్ లో అలాగే కొన్ని లోకేషన్స్ లో కొన్ని సీన్స్ షూట్ చేసారు. నెక్స్ట్ షెడ్యుల్ ఈ నెల 26 నుండి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఒక షెడ్యుల్, కేరళలో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చి బాబు డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కుతున్న ‘ఉప్పెన’ రెండో షెడ్యుల్ మొదలైంది. సారధీ స్టూడియోస్ లో ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ , మోనికా భారీ సెట్ లో షూట్ జరుగుతుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి , కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ లపై కొన్ని సీన్స్ తీస్తున్నారు.


గోపీచంద్ ‘చాణక్య’ సినిమా సెకండ్ షెడ్యుల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే యూనిట్ సాంగ్స్ కోసం యూరప్ వెళ్ళనున్నారు. మిలన్ లో రాజు సుందరం కోరియోగ్రఫీలో మూడు సాంగ్స్ షూట్ చేస్తారు. ఏకే ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాతో తిరు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.