పూరి మార్క్ తో విజయ్ దేవరకొండ

Sunday,August 25,2019 - 12:10 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఐయాం బ్యాక్ అనిపించుకొని గ్రాండ్ సక్సెస్ అందుకున్న పూరి జగన్నాథ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే పూరి ఈ సినిమాను కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ తరహాలోనే పక్కా మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తాడని మొన్నటి వరకూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడు మరో ఎలిమెంట్ బయటికొచ్చింది.

పూరి ఈసారి ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను చేయబోతున్నాడట. గతంలో ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’ సినిమా తరహాలోనే ఈ సినిమాలో కూడా హీరో కిక్ బాక్సర్ గా కనిపిస్తాడని అంటున్నారు. అందుకే ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు.