ఇంట్లో కూడా సినిమాల గురించి మాట్లాడుకుంటాం

Tuesday,April 02,2019 - 07:01 by Z_CLU

పెళ్లి తర్వాత తొలిసారి కలిసి సినిమా చేశారు నాగచైతన్య, సమంత. ప్రమోషన్ లో భాగంగా జీ సినిమాలు తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. పెళ్లి తర్వాత తమ జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదంటున్న ఈ హాట్ కపుల్.. ఇంట్లో కూడా మంచి స్టోరీలైన్స్ గురించి మాట్లాడుకుంటామంటున్నారు.

సమంత – “చైతూకు నేను సలహాలు ఇవ్వను. కానీ మంచి ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఇంట్లో మాట్లాడుకుంటాం. నాకేదైనా మంచి ఆఫర్ వస్తే చైతూతో చెబుతాను.

నాగచైతన్య – “జనరల్ గా ఎప్పటికప్పుడు మేం సినిమాల గురించి మాట్లాడుకుంటాం. మజిలీ గురించి కూడా మాట్లాడుకున్నాం. నిజానికి దర్శకుడు శివ మా ఇద్దర్నీ కలిపి కూర్చోబెట్టి కథ చెప్పాడు. ఆ తర్వాత మేమిద్దం కూడా కొన్ని సీన్లు, డైలాగులు గురించి మాట్లాడుకున్నాం. క్లైమాక్స్ పార్ట్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకున్నాం.”