ఏప్రిల్ వీళ్ళకి చాలా స్పెషల్ !

Tuesday,April 02,2019 - 02:22 by Z_CLU

ఏ హీరోకైనా పీక్ టైంలో సరైన హిట్ పడాల్సిందే.. అప్పుడే మళ్ళీ వరుస అవకాశాలతో దూసుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఓ నలుగురు యంగ్ హీరోలు ఇదే ఫేజ్ లో ఉన్నారు. ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే తమ సినిమాతో మళ్ళీ ఓ సూపర్ హిట్ కొట్టి హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు.


ఈ లిస్టులో ముందున్నాడు అక్కినేని నాగ చైతన్య. చైతూ -సమంత జంటగా నటించిన ‘మజిలీ’ ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రానుంది. వరుస ఫ్లాపులతో సతమవుతున్న చైతూ కెరీర్ కి ఈ సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే పోస్టర్స్ , ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రిలీజ్ కి ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ‘మజిలీ’ సక్సెస్ అయింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో..చూడాలి.


కెరీర్ ప్రారంభంలో వరుస సూపర్ హిట్స్ తో మెగా సుప్రీం హీరో అనిపించుకున్న సాయి ధరం తేజ్ లేటెస్ట్ గా వరుస పరాజయాలు అందుకున్నాడు. ఇప్పుడు తేజ్ ఆశలన్నీ ‘చిత్రలహరి’ మీదే. ఇప్పటికే టీజర్, సాంగ్స్ హంగామా చేస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఏప్రిల్ 12 న విడుదలవుతున్న ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మెగా హీరోగా ImBack అనిపించుకోవాలని చూస్తున్నాడు తేజ్.


వరుసగా ఆరు సక్సెస్ లు అందుకున్న నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా ‘కృష్ణార్జున యుద్ధం’తో ఫ్లాప్ అందుకున్న సంగతి తెలిసిందే.. మళ్ళీ వరుస విజయాలు అందుకుంటూ రేస్ గుర్రంలా పరిగెత్తాలని చూస్తున్నాడు నాని. ఆ హిట్ రేస్ ని ‘జెర్సీ’ మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఈ సినిమా మీద నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు. ప్రత్యేకంగా క్రికెట్ ట్రైనింగ్ తీసుకొని మరీ సినిమా చేసాడు. ‘జెర్సీ’ తనని మళ్ళీ వరుస విజయాల వైపు పరిగెట్టేలా చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు.


ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బెల్లం కొండ ఆ తర్వాత వరుస సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం తేజ తనకి ఓ సూపర్ హిట్ ఇస్తాడని వెయిట్ చేస్తున్నాడు. బెల్లం కొండ -కాజల్ జంటగా నటించిన సీత ఏప్రిల్ 25 న థియేటర్స్ లోకి రాబోతుంది. మరి ఈ సినిమాతో బెల్లం కొండ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.