షూటింగ్ అప్ డేట్స్

Friday,March 08,2019 - 04:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం…

శివరాత్రి రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రవి తేజ ‘డిస్కో రాజా’ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. లాంచ్ అయిన నెక్స్ట్ డే నుండే షూట్ మొదలెట్టేసాడు మాస్ మహారాజ్. ఎక్కువ రోజులు బ్రేక్ తీసుకోకుండా లాంగ్ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఫస్ట్ షెడ్యుల్ షూట్ టోటల్ గా హైదరాబాద్ లోనే జరగనుంది. మరో వైపు ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ వేస్తున్నారు. విభిన్న కథా చిత్రాల దర్శకుడు వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. రవి తేజ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది.


రామ్ -పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ ప్రెజెంట్ గోవాలో జరుగుతుంది. ఇటివలే హైదరాబాద్ లో ఒక భారీ షెడ్యుల్ ఫినిష్ చేసిన యూనిట్ గోవాలో యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. రియల్ సతీష్ కంపోజ్ చేస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ ఇంకో వారం పాటు జరగనుందని సమాచారం. పూరి జగన్నాథ్ -చార్మీ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణి శర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మహానటి తర్వాత తెలుగులో కీర్తి సురేష్ నటిస్తున్న సినిమా ఇటివలే మున్నార్ లో ఒక షెడ్యుల్ కంప్లీట్ చేసుకుంది. మున్నార్ లో చైల్డ్ ఎపిసోడ్స్ షూట్ చేసిన యూనిట్ ఇప్పుడు మరో షెడ్యుల్ కి రెడీ అవుతోంది. మార్చ్ 10 నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో రెండో షెడ్యుల్ స్టార్ట్ అవుతోంది. అన్నపూర్ణలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాతో నరేంద్రనాథ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కళ్యాణ్ కోడూరి ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజర్.

జెట్ స్పీడ్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న వైష్ణవ్ తేజ్ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే కొన్ని లోకేషన్స్ ఫిక్స్ చేసుకున్న యూనిట్ త్వరలోనే సముద్రపు ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేయబోతున్నారు. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మనిషా రాజ్ హీరోయిన్ గా నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన విజయ్ దేవరకొండ-క్రాంతి మాధవ్ సినిమా ఫస్ట్ షెడ్యుల్ పూర్తి చేసుకుంది. 14 రోజుల పాటు ఖమ్మం దగ్గర ఎల్లందులో కొన్ని సీన్స్ షూట్ చేసారు. వచ్చే నెలలో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రాశీ ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , ఇజబెల్లె హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

పి.వి.గిరి డైరెక్షన్ లో అల్లరి నరేష్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజికి చేరుకుంది.. ఈ నెల 20 నుండి మిగిలిన షూట్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. పది రోజులపాటు జరగనున్న ఈ షెడ్యుల్ లో అంతర్వేది , రాజోలు పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లో కూడా కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. ఎ.కే.ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదలకి ప్లాన్ చేస్తున్నారు .