షూటింగ్ అప్ డేట్స్

Sunday,February 23,2020 - 11:10 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ప్రస్తుతం స్టూడియో వేసిన భారీ సెట్ లో చరణ్ , తారక్ లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. డి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కానుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా సెకెండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్ లోనే షూటింగ్ జరుగుతుంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. క్రిష్ మూవీకి పవన్ బల్క్ లో కాల్షీట్లు కేటాయించాడు. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమా షూట్ లోనే పాల్గొనబోతున్నాడు పవన్.

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘నారప్ప’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. 10 రోజులు పాటు తమిళనాడులోని తిరిచందూర్ సమీపంలో 12,000 ఎకరాల్లో ఉండే తెరికాడులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. అక్కడ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప’ కి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేసారు యూనిట్.

ఇప్పటికే 27 రోజుల పాటు షూట్ చేసిన యూనిట్ సినిమాను ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలోనే టోటల్ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్న’రెడ్’ చిత్రం కోసం 2 పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఆ రెండు పాటల్లో ఒకదాన్ని డోలమైట్స్ లో షూట్‌ చేయడం విశేషం. ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని బ్యూటీఫుల్‌ లొకేషన్స్ లో రామ్‌, మాళవికా శర్మలపై ఈ రెండు పాటలు తీశారు.

షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో ఆ పాట చిత్రీకరణ ఉంటుంది. ఏప్రిల్‌ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతోంది రెడ్.

నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం హీరో -హీరోయిన్ లపై కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘నాంది’ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం అమీర్ పేట్ లో అల్లరి నరేష్ మరికొంత మంది నటీ నటులపై సీన్స్ తీస్తున్నారు. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ క‌న‌క‌మేడ‌ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వేగేశ్న సతీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.