ఎన్టీఆర్ -త్రివిక్రమ్ సినిమాలో కన్నడ బ్యూటీ ?

Sunday,February 23,2020 - 12:00 by Z_CLU

ఎన్టీఆర్ 30వ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇటివలే అనౌన్స్ అయిన ఈ భారీ బడ్జెట్ సినిమా మే నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు హీరోయిన్ గా రష్మికను తీసుకొనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

రిలీజ్ కి ముందే ‘భీష్మ’ సినిమా చూసిన త్రివిక్రమ్ సినిమాలో రష్మిక క్యారెక్టర్ కి ఇంప్రెస్ అయి తన సినిమాకు హీరోయిన్ గా  ఫిక్సయ్యాడని టాక్ వినిపిస్తుంది. మరో వైపు మళ్ళీ పూజా హెగ్డే ను తీసుకుంటారనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. మరి ఫైనల్ గా ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

హారికా & హాసినీ క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై చినబాబు , కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు.