బుల్లితెర ప్రభంజనం.. శతమానం భవతి

Thursday,April 06,2017 - 04:20 by Z_CLU

సంక్రాంతి కానుకగా వచ్చిన శతమానంభవతి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడా సూపర్ డూపర్ హిట్ సినిమా టీవీల్లో కూడా ప్రభజనం సృష్టించింది. బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మార్చి 26 ఆదివారం రోజున జీ తెలుగులో ప్రసారమైన శతమానంభవతి సినిమా.. టీఆర్పీ రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు సృష్టించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. రూరల్, అర్బన్ అనే తేడాలేకుండా… మేల్, ఫిమేల్ అనే తారతమ్యం లేకుండా అంతా జీ తెలుగులో శతమానం భవతి సినిమానే చూశారు.

ఓవైపు టీవీల్లో బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్, మరోవైపు ఇంకో కొత్త సినిమా హంగామా… ఇంత గట్టిపోటీ మధ్య కూడా వీక్షకులందర్నీ తనవైపు తిప్పుకుంది శతమానంభవతి మూవీ. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కు టీవీల్లో ఎప్పుడూ ఆదరణ ఉంటుందని మరోసారి నిరూపించింది శతమానంభవతి. తెలుగు వీక్షకుల నుంచి ఈ సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

శతమానంభవతి సినిమాతో దిల్ రాజు బ్రాండ్ మరోసారి ఎలివేట్ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  ఉత్తమ చిత్రాల్ని నిర్మించే దిల్ రాజు.. శతమానంభవతి మూవీతో తన బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుకోగలిగారు. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, జయసుధ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోతుంది.