శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్

Wednesday,January 11,2017 - 07:00 by Z_CLU

శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్ ని ఈ సారి కూడా క్యారీ చేశాడు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజా తో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ ఈ సారి సంక్రాంతికి ‘శతమానం భవతి’ తో సిద్ధంగా ఉన్నాడు. అసలే పీక్ స్టేజ్ లో ఉన్న సంక్రాంతి ఫీవర్ కి డబల్ డోస్ లా తెరకెక్కిన శతమానం భవతి గ్రాండ్ హిట్ గ్యారంటీ అనే బజ్ నడుస్తుంది.

పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘శతమానం భవతి’ సినిమాతో శర్వానంద్, ఫ్యాన్స్ లో అటు క్రేజ్ ని, ఇటు మార్కెట్ ని పెంచుకునే పనిలో పడ్డాడు.ఇప్పటికే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్న ‘శతమానం భవతి’, ఓవర్ సీస్ లోను అత్యధిక సెంటర్ లలో రిలీజ్ కానుంది.