Tillu2 రిలీజ్ డేట్ వచ్చేసింది

Monday,June 05,2023 - 04:36 by Z_CLU

Starboy Siddhu and Sithara Entertainments’ Tillu Square Release Date announced

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బేనర్స్ పై నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా ‘టిల్లు స్క్వేర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘డీజే టిల్లు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్ధు, ఆ పేరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.యంగ్ టాలెంటెడ్ సిద్ధు అందించిన ఈ కొత్తతరం కామెడీ థ్రిల్లర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా డీజే టిల్లు పాత్ర ప్రేక్షకులను హిలెరియస్ గా ఎంటర్టైన్ చేసింది.

ఇప్పుడు ‘డీజే టిల్లు’ కి సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్’తో వస్తున్నాడు సిద్దు. ఈసారి డబుల్ ఎంటర్టైన్ అందించడానికి  క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తోడయ్యారు.

ప్రస్తుతం షూటింగ్ స్టేజీలో ఉన్న ఈ సినిమాను 2023 లో సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు, సిద్ధు-అనుపమ పరమేశ్వరన్‌ ల రొమాంటిక్ పోస్టర్‌ తో రిలీజ్ డేట్ చెప్పారు మేకర్స్.  మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.