'ఖైదీ నంబర్ 150' లో ప్రభాస్....

Wednesday,January 11,2017 - 08:00 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి దాదాపు 10 ఏళ్ల తర్వాత రి ఎంట్రీ ఇస్తూ నటించిన ‘ఖైదీ నంబర్ 150’ హంగామా స్టార్ట్ అయింది. మెగా స్టార్ ని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద చూద్దామా ? అని ఎదురుచూసిన ఆడియన్స్ ఎట్ట కేలకి చిరు ని సిల్వర్ స్క్రీన్ పై చూసి సంబర పడిపోతున్నారు. ఓ సాంగ్ లో చిరు తో కలిసి రామ్ చరణ్ స్టెప్స్ వేస్తారని అలాగే ఎండింగ్ టైటిల్స్ లో మెగా స్టార్ తో పాటు మెగా హీరోస్ అందరూ కనిపిస్తారని యూనిట్ ముందే చెప్పడం తో మెగా ఫాన్స్ లో ఉత్సాహం మొదలైంది.

  అయితే యూనిట్ ముందు గానే చెప్పి నట్లు ఈ సినిమా సెట్స్ లోకెళ్ళిన మెగా హీరోలందరూ రోలింగ్ టైటిల్స్ లో కనిపించగా ప్రభాస్ కూడా సప్రయిజ్ ఇచ్చాడు. మొన్నా మధ్య ‘బాహుబలి’ షూటింగ్ ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ ఒకే స్టూడియో లో జరిగినప్పుడు రాజమౌళి తో కలిసి ‘ఖైదీ నంబర్ 150’ సెట్ లోకి వెళ్లి చిరు ను పలకరించాడు ప్రభాస్. ఆ సందర్భం లో వీరిద్దరూ కలిసిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్చల్ చేశాయి కూడా. అయితే ఆ సన్నివేశాలను షూట్ చేసి రోలింగ్ టైటిల్స్ లో వేశారు ఖైదీ యూనిట్. ఇక ప్రభాస్ తో పాటు సునీల్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సెట్ లో సందడి చేసి ఫైనల్ గా చిరు రీ ఎంట్రీ సినిమాలో ఎంట్రీ ఇచ్చారు…