రానా ఘాజీ ట్రయిలర్ రిలీజ్

Wednesday,January 11,2017 - 05:44 by Z_CLU

“చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా, విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశపు భవిష్యత్తులో మనం నిలిచిపోతాం..” జస్ట్ రిలీజ్డ్ రానా ‘ఘాజీ’ సినిమా ట్రేలర్ లో వైబ్రేషన్స్ సృష్టిస్తున్న డైలాగ్ ఇది. సబ్ మెరిన్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా పవర్ ఫుల్ నేవీ ఆఫీసర్ గా నటించాడు.

1971 లో విశాఖపట్నం పోర్ట్ ని సమూలంగా నాశనం చేసే ఉద్దేశంతో పాకిస్తాన్ పన్నిన వ్యూహాన్ని తిప్పికొట్టడానికి ఇండియన్ నేవీ చేసిన విశ్వ ప్రయత్నమే ఘాజీ. సముద్ర భూగర్భంలో జరిగే యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి సినిమాగా కూడా ఘాజీ రికార్డు క్రియేట్ చేయబోతుంది.

అల్టిమేట్ రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటించింది. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ చేసిన ఈ సినిమా 17 ఫిబ్రవరి, 2017  న రిలీజ్ కానుంది. రిలీజ్ అయిన కాసేపటికే ట్రయిలర్ కు టాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.