రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కామెడీ హీరో

Monday,June 18,2018 - 07:31 by Z_CLU

టాలీవుడ్ లో చాలా మంది కమెడియన్స్ హీరోలుగా నటించి సక్సెస్ అందుకున్నారు. ఇప్పడు అదే ట్రాక్ లో కామెడీ మాస్ ఎంటర్ టైనర్ ‘శంభో శంకర’ తో, తన లక్ ని చెక్ చేసుకున్నాడు కమెడియన్ షకలక శంకర్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో మ్యాగ్జిమం ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసింది. అయితే ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

‘శంభో శంకర’ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ అయితే ప్రస్తుతానికి బయటికి రాలేదు కానీ, షకలక శంకర్ మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ కన్విన్సింగ్ గా పర్ఫామ్ చేయడం, సినిమాపై పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తుంది. కేవలం 35 రోజుల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఈ సినిమాలో షకలక శంకర్ సరసన కారుణ్య హీరోయిన్ గా నటించింది. సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజర్. సురేష్ కొండేటి, Y. రమణా రెడ్డి ప్రొడ్యూసర్స్. N. శ్రీధర్  డైరెక్టర్.