మరో 2 రోజుల్లో ‘పేపర్ బాయ్’ ఫస్ట్ లుక్

Monday,June 18,2018 - 06:50 by Z_CLU

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న సంపత్ నంది ‘గాలిపటం’ సినిమాతో సెన్సిబుల్ ప్రొడ్యూసర్ అనే మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే అదే స్పీడ్ లో రీసెంట్ గా గోపీచంద్ చేతుల మీదుగా ‘పేపర్ బాయ్స్’ సినిమాను లాంచ్ చేసిన సంపత్ నంది, ఈ సినిమా అఫీషియల్ ప్రమోషన్స్ ని బిగిన్ చేశాడు. ఈ రోజు ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేసిన ఫిల్మ్ మేకర్స్, జూన్ 20 ‘పేపర్ బాయ్’ ఫస్ట్ లుక్ ని రివీల్ చేయనున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు సినిమాకి సంబంధించి తక్కిన డీటేల్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే ప్రిపరేషన్స్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్, సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జయశంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ యూత్ కి ఈజీగా కనెక్ట్ అవుతుంది.

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తాన్య హోప్, ప్రియశ్రీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బీమ్స్ మ్యూజిక్ కంపోజర్. సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ పై ‘పేపర్ బాయ్’ తెరకెక్కుతుంది.