'శంభో శంకర' టీజర్

Saturday,June 09,2018 - 10:00 by Z_CLU

శంక‌ర్ ని హీరోగా,  శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘శంభో శంక‌ర’. ఈ సినిమా టీజ‌ర్‌ని  డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ” హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ – “శంక‌ర్ నాకు ప‌దేళ్లుగా తెలుసు. ఆఫీస్ బాయ్ స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగాడు శంక‌ర్‌. ప‌వ‌న్‌గారితో గ‌బ్బ‌ర్‌సింగ్ స‌క్సెస్‌లో శంక‌ర్ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే త‌ను అద్భుతంగా స్కెచ్‌ల‌ను వేసి ఇచ్చాడు. ప‌వ‌న్‌గారు కూడా శంక‌ర్‌ను ఆ విష‌యంలో అభినందించారు. త‌ర్వాత కాలంలో ప‌వ‌న్‌గారితో కూడా శంక‌ర్ న‌టించాడు. 35 రోజుల్లో సినిమాను పూర్తి చేయ‌డం అంత సుల‌భం కాదు. ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను, యూనిట్‌ను అభినందిస్తున్నాను. ” అన్నారు.

 హీరో శంక‌ర్ మాట్లాడుతూ – “నేను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారిని మ‌న‌సులో పెట్టుకునే ప‌ని చేశాను. అందుకే ఈ స్థాయికి ఎదిగాను. నేను ఎక్స‌ర్‌సైజులు చేసి బ‌రువు త‌గ్గాన‌ని అనుకున్నారు . కానీ రెండేళ్లు సినిమాలు లేక‌.. తిండి లేక త‌గ్గిపోయాను. అలాంటి టైమ్‌లోనే ఈ సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. నా వంతు ప్ర‌య‌త్నం చేశాను. ఫ‌లితాన్ని ప్రేక్ష‌కులే నిర్ణ‌యిస్తారు. మంచి నిర్మాత‌లు స‌హ‌కారంతో శ్రీధ‌ర్ సినిమాను తెర‌కెక్కించారు. అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.