షారుక్ ఖాన్ 'జీరో' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Monday,December 24,2018 - 12:19 by Z_CLU

భారీ అంచనాల మధ్య రిలీజైన షారుక్ ఖాన్ ‘జీరో’ ఈ వీకెండ్, ట్రేడ్ వర్గాలను టోటల్ గా డిజప్పాయింట్ చేసింది. రిలీజ్ కి ముందు సినిమాపై క్రియేట్ అయిన బజ్ ని బట్టి మినిమం 100 కోట్లు గ్యారంటీ అని, ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ జస్ట్ 59.07 కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది జీరో.

శుక్రవారం : 20.14

శనివారం : 18.22

ఆదివారం : 20.71

బాక్సాఫీస్ కి క్రిస్మస్ హాలీడేస్ కొద్దో గొప్పో కలిసొస్తాయని, 6 నిమిషాల ఫూటేజ్ ని తగ్గించిన మేకర్స్ ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాలేదు. ‘జీరో’ రెగ్యులర్ స్టోరీస్ కి డెఫ్ఫినెట్ గా డిఫెరెంట్ గా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసిన ఆడియెన్స్ కి, సినిమాలో ఫీల్ తప్ప, స్టోరీ కనిపించకపోవడంతో, ఆ ఎఫెక్ట్ బాక్సాఫీస్ పై భారీ స్థాయిలో కనిపిస్తుంది.

మరోపక్క దర్శకుడు ఆనంద్ L. రాయ్, సినిమాలోని 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేసిన తీరు, సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ సినిమాకి కొద్దో గొప్పో వెయిటేజ్ తీసుకొస్తుంది. అజయ్- అతుల్   ఈ  సినిమాకి  మ్యూజిక్ కంపోజ్ చేశారు. గౌరీ ఖాన్ ప్రొడ్యూసర్.