ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న షారుక్ ఖాన్

Monday,February 27,2017 - 06:12 by Z_CLU

షారుక్ ఖాన్ అకౌంట్ లో మరో ప్రతిష్టాత్మక అవార్డు చేరింది. ముంబైలో జరిగిన వేడుకలో ‘యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు’ ను కళాబంధు T. సుబ్బరామిరెడ్డి చేతుల మీదుగా షారుక్ అందుకున్నాడు. జస్ట్ ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న షారుక్ కృషిని బాలీవుడ్ ప్రముఖులు ఎంతగానో ప్రశంసించారు.

ఇప్పటివరకు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ లాంటి నట దిగ్గజాలు అందుకున్న ఈ అవార్డును ఇపుడు షారుక్ అందుకోవడం అటు కింగ్ ఖాన్ కే కాదు, ఆయన ఫ్యాన్స్ లో కూడా ఫుల్ జోష్ ని నింపేసింది.

ఇదే వేదిక పై ‘యష్ చోప్రా మెమోరియల్ అవార్డ్స్’ ఫౌండర్ T. సుబ్బరామిరెడ్డి గారు మాట్లాడుతూ త్వరలోనే షారూక్ కు ‘మిలీనియం స్టార్ అవార్డు’ను అందజేస్తున్నట్టు ప్రకటించారు.