షారూక్.. సంథింగ్ స్పెషల్

Wednesday,October 19,2016 - 01:13 by Z_CLU

ఆలియా భట్, షారుఖ్ ఖాన్ జంటగా తెరకెక్కిన ‘డియర్ జిందగీ’ సినిమాని సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. రోజుకో ఫన్నీ వీడియోతో వినూత్నంగా సినిమా ప్రచారం చేస్తున్న షారుక్ ఖాన్, “ డియర్ జిందగీ” పోస్టర్ ని రిలీజ్ చేస్తూనే బుధవారం రోజు ఇంకో సర్ ప్రైజ్ ఉండబోతుందని ఫ్యాన్స్ లో ఇంకా ఆసక్తిని పెంచేశాడు. దానికి తగ్గట్టే టీజర్ ను విడుదల చేశాడు.

తాజాగా ఈ సినిమా ప్రచారానికి సంబంధించి షారూక్ స్నానం చేస్తుండగా ఓ వీడియో పిక్చరైజ్ చేశారు. ఆ వీడియోకు సంబంధించి షారూక్.. ఫన్నీగా ఓ కామెంట్ కూడా పెట్టాడు. అలియాకు బుద్ధిలేదని, ఎక్కడపడితే అక్కడ ప్రశ్నలు వేస్తోందని, కానీ వాటన్నింటినీ సమాధానం చెప్పాలనే బాధ్యత తనపై ఉందంటున్నాడు షారూక్.